Cricket: రెండో ఇన్నింగ్స్‌లోనూ మెరిసిన గిల్.. భారత్ భారీ స్కోర్..
భారత్ భారీ స్కోర్..;
By : PolitEnt Media
Update: 2025-07-05 18:05 GMT
Cricket: ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ 427 పరుగుల వద్ద ముగిసింది. దీంతో ఇంగ్లాండ్ ముందు 607 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. భారత్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో కూడా మెరిసిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించడమే కాకుండా 161 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్‌ను ఆడాడు. కెప్టెన్ గిల్ కు మంచి సహకారం అందించిన రిషబ్ పంత్ 65 రన్స్ చేయగా.. రవీంద్ర జడేజా 69 పరుగులు చేశాడు. ఈ ముగ్గురితో పాటు కెఎల్ రాహుల్ కూడా 55 రన్స్ చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో పేసర్ టోంగ్, స్పిన్నర్ షోయబ్ బషీర్ తలా 2 వికెట్లు పడగొట్టారు.