Cristiano Ronaldo: ప్రియురాలితో క్రిస్టియానో రోనాల్డో ఎంగేజ్ మెంట్
క్రిస్టియానో రోనాల్డో ఎంగేజ్ మెంట్;
Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో తన ప్రియురాలు జార్జినా రోడ్రిగ్జ్‌తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
రోనాల్డో, జార్జినా దాదాపు ఎనిమిదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ కాలంలో వారికి ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. రోనాల్డోకు తన మొదటి భాగస్వామితో కలిగిన ముగ్గురు పిల్లల బాధ్యతలను కూడా జార్జినా తీసుకుని, వారిని పెంచడంలో తోడ్పడింది. 2016లో మాడ్రిడ్‌లోని ఒక గూచీ స్టోర్‌లో పనిచేస్తున్నప్పుడు జార్జినాను రోనాల్డో తొలిసారిగా కలిశాడు. అప్పటినుండి వారి ప్రేమ బంధం కొనసాగుతోంది. ఈ నిశ్చితార్థంతో రోనాల్డో, జార్జినా తమ బంధాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. వారి పెళ్లి తేదీ ఇంకా ప్రకటించలేదు.
జార్జినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రోనాల్డోతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆమె చేతికి డైమండ్ రింగ్ కనిపించింది. "అవును నేను అంగీకరిస్తున్నాను. ఈ జన్మలోనూ, నా అన్ని జన్మలలోనూ" అని ఆమె స్పానిష్ భాషలో రాసింది. జార్జినాకు రోనాల్డో ఇచ్చిన ఉంగరం విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ ఉంగరం భారీ ఓవల్-కట్ డైమండ్‌తో తయారు చేయబడింది.