Test Series England: ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్.. ఈ ఆటగాడే కీలకం
ఈ ఆటగాడే కీలకం;
Test Series England: బలమైన ఇంగ్లాండ్ జట్టును ఎదుర్కోవడానికి యువ భారత్ సిద్ధంగా ఉంది. ఈ యంగ్ ఇండియాలో అత్యంత అనుభవజ్ఞుడైన బ్యాటర్ కెఎల్ రాహుల్. 33 ఏళ్ల రాహుల్‌కు ఇప్పటికే ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడిన అనుభవం ఉంది. అందుకే ఈసారి అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ అంచనాలతో కెఎల్ రాహుల్ టీమిండియా తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే భారత టెస్ట్ జట్టుకు ఓపెనర్‌గా ఆడుతున్న రోహిత్ శర్మ ఇప్పటికే తన రిటైర్మెంట్ ప్రకటించాడు. గతంలో హిట్‌మ్యాన్ లేనప్పుడు, రాహుల్ యశస్వి జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.
అందువల్ల ఈసారి మంచి ఆరంభం ఇచ్చే బాధ్యతను కెఎల్ రాహుల్ భుజాలపై వేసుకోవడం దాదాపు ఖాయం. ఎందుకంటే కెఎల్‌ఆర్‌కు ఇంగ్లాండ్‌లో 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది. ఈ తొమ్మిది మ్యాచ్‌ల్లో రాహుల్ 18 ఇన్నింగ్స్‌లు ఆడి 614 పరుగులు చేశాడు. అంటే అతను ఇంగ్లాండ్‌లో 34.11 సగటుతో పరుగులు సాధించాడు.
ఈ 18 ఇన్నింగ్స్‌లలో కెఎల్ రాహుల్ బ్యాట్‌తో 2 అద్భుతమైన సెంచరీలు కూడా చేశాడు. అతను అర్ధ సెంచరీ కూడా సాధించాడు. అంతే కాదు టీమిండిలో ప్రస్తుత బ్యాట్స్‌మెన్ జాబితాలో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్ కూడా కెఎల్ రాహుల్. కెఎల్ రాహుల్ ఇప్పటివరకు ఇంగ్లాండ్‌పై 24 ఇన్నింగ్స్‌లు ఆడి మొత్తం 955 పరుగులు చేశాడు.
అందుకే ఇంగ్లాండ్‌పై టీమిండియా సిరీస్ గెలవాలంటే రాహుల్ పాత్ర కీలకం. ఈ బాధ్యతాయుతమైన పాత్రతో కెఎల్ రాహుల్ ఇంగ్లాండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టును విజయపథంలో నడిపించగలడా లేదా అనేది చూడాలి.