Day 2 : రెండో రోజు ఇండియాదే..స్కోర్ ఎంతంటే..?

స్కోర్ ఎంతంటే..?;

Update: 2025-08-02 07:06 GMT

Day 2 :  ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు టీమిండియానే పై చేయి సాధించింది. ఇంగ్లాండ్ ను తొలి ఇన్నింగ్స్ లో 247 పరుగులకే ఆలౌట్ చేసి ఇంగ్లాండ్‌పై 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.

రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం 44 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అద్భుతంగా ఆడాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆకాష్ దీప్ 4, జైశ్వాల్ 51 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో నిరాశపరిచినప్పటికీ, బౌలర్లు జైశ్వాల్ దూకుడైన బ్యాటింగ్ తో భారత జట్టు మ్యాచ్‌లో పుంజుకొని మంచి స్థితిలో ఉంది.

అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్224 పరుగులకే ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ (57 పరుగులు) కీలక అర్ధ సెంచరీతో రాణించాడు. సాయి సుదర్శన్ (38 పరుగులు) , వాషింగ్టన్ సుందర్ (26 పరుగులు)లు చేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. మొహమ్మద్ సిరాజ్ (4 వికెట్లు) , ప్రసిద్ధ్ కృష్ణ (4 వికెట్లు) ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను దెబ్బతీశారు. దీంతో ఇంగ్లాండ్ 247 పరుగులకే ఆలౌట్ అయింది.ఈ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కేవలం 23 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే సాధించగలిగింది.

Tags:    

Similar News