Ashwin Urges: రోకోపై ఇపుడే నిర్ణయం తీసుకోండి..సెలక్టర్లకు అశ్విన్ హెచ్చరిక
అశ్విన్ హెచ్చరిక
Ashwin Urges: టీమిండియా సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి లక్ష్యం ఇప్పుడు ఒక్కటే... రాబోయే వన్డే ప్రపంచ కప్! ఇందుకోసమే వీరిద్దరూ ప్రత్యేకంగా 50 ఓవర్ల ఫార్మాట్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టారు. ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు కూడా వీరిద్దరూ ఎంపికయ్యారు.
అయితే, వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలకు చోటు దక్కడం కష్టమేననే ప్రచారం జోరందుకుంది. దీనిపై అటు మేనేజ్‌మెంట్ కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రోహిత్, విరాట్‌లపై కొందరు కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారంటూ అశ్విన్ ఘాటుగా స్పందించాడు.
రోహిత్, విరాట్ గురించి వస్తున్న వార్తలు అస్సలు బాగోలేవు. అసలు ఈ నెగెటివిటీ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావడం లేదు. కొందరైతే ఈ ఇద్దరూ ప్రపంచ కప్ ఆడకూడదని బలంగా కోరుకుంటున్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్, కోహ్లి లాంటి అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండటం జట్టుకు చాలా ముఖ్యం.
అంతేకాదు సెలక్టర్లకు అశ్విన్ ఒక కీలక సూచన చేశాడు. వన్డే ప్రపంచ కప్‌లో విరాట్, రోహిత్ ఉండాలని అనుకుంటే.. ఆ నిర్ణయాన్ని ఇప్పుడే ప్రకటించాలని డిమాండ్ చేశాడు. అలా ముందే చెబితే టోర్నీ నాటికి వారు పూర్తి ఆత్మవిశ్వాసంతో సిద్ధమవుతారని, లేదంటే మున్ముందు ఈ విషయం మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందని అశ్విన్ హెచ్చరించాడు.