Digvesh Rathi: వీడు మామూలోడు కాదు.. 5 బంతుల్లో 5 వికెట్లు
5 బంతుల్లో 5 వికెట్లు;
Digvesh Rathi: లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేష్ రాత్ లోకల్ టీ20 లీగ్ లో 5 బంతుల్లో 5 వికెట్లు పడగొట్టి సంచలనంగా మారాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన దిగ్వేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 264 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ ఛేజింగ్ లో ప్రత్యర్థి జట్టు 14 ఓవర్లు ముగిసేసరికీ 5 వికెట్ల నష్టానికి 151 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తోంది. గెలవాలంటే విజయానికి చివరి 36 బంతుల్లో 113 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో 15 ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన దిగ్వేశ్ తన తొలి బంతుల్లో వికెట్లను తీసుకోవడం విశేషం. ఈ మిస్టరీ స్పిన్నర్ ధాటికి ప్రత్యర్థి వద్ద సమాధానమే లేకుండా పోయింది.
చూస్తుండగానే 5 నిమిషాలలోపే ఇన్నింగ్స్ ముగిసింది. దిగ్వేశ్ తీసిన 5 వికెట్లతో నాలుగు క్లీన్ బౌల్డ్ అవ్వడం విశేషం. ప్రస్తుతం ఈ లక్నో సూపర్ జయింట్స్ స్పిన్నర్ బౌలింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇటీవలే ముగిసిన 2025 ఐపీఎల్ లో అదరగొట్టిన దిగ్వేశ్.. 13 మ్యాచ్‌ల్లో 30.64 సగటుతో 14 వికెట్లు పడగొట్టాడు.