Dinesh Karthik: టీమిండియా కెప్టెన్ గా దినేశ్ కార్తీక్
కెప్టెన్ గా దినేశ్ కార్తీక్
Dinesh Karthik: హాంగ్ కాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా మాజీ భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్ వ్యవహరించనున్నారని నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 7 నుంచి 9 వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది.
దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత కూడా ఈ టోర్నమెంట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఆయనకు ఉన్న విస్తృత అంతర్జాతీయ అనుభవం, నాయకత్వ నైపుణ్యాలు, దూకుడైన బ్యాటింగ్ స్టైల్ జట్టుకు చాలా ఉపయోగపడతాయని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఇంత గొప్ప చరిత్ర కలిగిన టోర్నమెంట్‌లో టీమిండియాకు నాయకత్వం వహించడం తనకు దక్కిన గౌరవం అని దినేశ్ కార్తీక్ అన్నారు. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆడనున్నారు. ఇది అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత తిరిగి మైదానంలోకి అడుగుపెట్టడం.
గతేడాది జరిగిన హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో భారత జట్టు రాణించలేకపోయింది. ఈసారి దినేశ్ కార్తీక్ సారథ్యంలో మంచి ప్రదర్శన చేసి అభిమానులను అలరిస్తారని భావిస్తున్నారు.