Shreyas Iyer: మళ్లీ నిరాశే... శ్రేయాస్ అయ్యార్ ఏం పాపం చేశాడు..?

శ్రేయాస్ అయ్యార్ ఏం పాపం చేశాడు..?;

Update: 2025-08-20 06:41 GMT

Shreyas Iyer: టీ20 ఆసియా కప్‌ 2025 కోసం భారత జట్టును ప్రకటించారు, అయితే ఈ జట్టులో శ్రేయాస్ అయ్యర్ , కేఎల్ రాహుల్ ఇద్దరికీ చోటు లభించలేదు. సెలెక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ దీనిపై మాట్లాడుతూ, ఇప్పటికే జట్టులో ఉన్న ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తుండటంతో వారికి చోటు దక్కలేదని స్పష్టం చేశారు. ఐపీఎల్ 2025లో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణించినప్పటికీ, ఇతర ఆటగాళ్లతో ఉన్న తీవ్రమైన పోటీ కారణంగా అతన్ని ఎంపిక చేయలేదని తెలిపారు. అదేవిధంగా కేఎల్ రాహుల్‌ను కూడా పక్కన పెట్టారు.

శ్రేయస్ అయ్యర్ 2024 ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టును టైటిల్ విజేతగా నిలిపి, 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లి తన కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. 2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన అయ్యర్, 17 మ్యాచ్‌లలో 604 పరుగులు సాధించాడు. అయినప్పటికీ, భారత జట్టులో నిలకడగా కొనసాగేందుకు అతని బ్యాటింగ్‌లో మరింత మెరుగుదల అవసరమని స్పోర్ట్స్ ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు.

ఆసియా కప్ కోసం ఎంపికైన భారత జట్టు :

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

Tags:    

Similar News