India’s Score in the Fourth Test: నాల్గో టెస్టులో ఇండియా స్కోర్ ఎంతంటే.?
ఇండియా స్కోర్ ఎంతంటే.?;
India’s Score in the Fourth Test: ఇండియా,-ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నాల్గో టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జులై 23న ప్రారంభమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సాయి సుదర్శన్ 61 పరుగులు చేయగా, యశస్వి జైస్వాల్ 58, కేఎల్ రాహుల్ 46 పరుగులు చేశారు. రిషబ్ పంత్ 37 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కాలికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 19,శార్దూల్ ఠాకూర్ 19 ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ 2 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. భారత్‌కు ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ చాలా కీలకం, ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉంటుంది.
ఈ మ్యాచ్ లో వ్యక్తిగత స్కోర్ 37 పరుగుల వద్ద కాలికి గాయం కావడంతో పంత్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో బంతి కాలికి బలంగా తగిలింది. ఇంగ్లాండ్ గడ్డపై 1000 టెస్ట్ పరుగులు పూర్తి చేసిన తొలి విదేశీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన వెంటనే అతనికి ఈ గాయం కావడం గమనార్హం.