Double Shock for England: ఇంగ్లాండ్‌కు డబుల్ షాక్.. గాయంతో ఆర్చర్ దూరం.. వివాదంలో బెన్ డకెట్
వివాదంలో బెన్ డకెట్
Double Shock for England: యాషెస్ సమరంలో పరువు కాపాడుకోవాలని చూస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకవైపు కీలక బౌలర్ సేవలు కోల్పోగా, మరోవైపు ఆటగాడి ప్రవర్తన జట్టు ప్రతిష్టను దిగజార్చుతోంది. జట్టులో అత్యంత వేగంగా బౌలింగ్ చేసే జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో ఆర్చర్ 9 వికెట్లు తీసి జట్టులో కీలక పాత్ర పోషించాడు. మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్‌కు దూరమైన ఆర్చర్ స్థానంలో అట్కిన్సన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
బెన్ డకెట్ మద్యం వివాదం
సిరీస్ మధ్యలో విరామం దొరికిన సమయంలో ఆటగాళ్లు ఒక బీచ్ రిసార్ట్‌లో గడిపారు. అయితే అక్కడ ఓపెనర్ బెన్ డకెట్ పరిమితికి మించి మద్యం సేవించినట్లు ఒక వీడియో వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు లోతైన విచారణకు ఆదేశించింది.
మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్
సిరీస్ ఇప్పటికే ఆసీస్ వశమైనా, తదుపరి మ్యాచ్‌లు ఇంగ్లాండ్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి.
నాల్గవ టెస్టు: ఈ శుక్రవారం నుంచి మెల్‌బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది.
ఐదవ టెస్టు: జనవరి 4 నుంచి సిడ్నీలో చివరి మ్యాచ్ జరగనుంది.
వరుస ఓటములతో కుంగిపోయిన ఇంగ్లాండ్, ఈ వివాదాల నుంచి తేరుకుని నాలుగో టెస్టులో ఎలా రాణిస్తుందో చూడాలి.