Dravid’s Heir Arrives: ద్రావిడ్ వారసుడు వచ్చేశాడు! ఇండియా అండర్-19 స్క్వాడ్‌లో అన్వయ్ ద్రావిడ్..
ఇండియా అండర్-19 స్క్వాడ్‌లో అన్వయ్ ద్రావిడ్..
Dravid’s Heir Arrives: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత నమ్మకమైన బ్యాటర్.. 'ది వాల్' (The Wall) అని అభిమానులు పిలుచుకునే రాహుల్ ద్రావిడ్ ఇంటా క్రికెట్ పండుగ మొదలైంది! తండ్రి బాటలోనే నడుస్తూ, ఆయన వారసత్వాన్ని క్రికెట్ పిచ్‌పై కొనసాగించడానికి సిద్ధమయ్యాడు ద్రావిడ్ సుపుత్రుడు 'అన్వయ్ ద్రావిడ్'. తాజాగా ప్రకటించిన భారత అండర్-19 వన్డే జట్టులో అన్వయ్ చోటు దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. జులై 4 నుంచి జులై 23 మధ్య జరగబోయే శ్రీలంక పర్యటన కోసం గురువారం ఈ జట్టును ప్రకటించారు.
భారత అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనలో భాగంగా మూడు వన్డే మ్యాచ్‌లు, అలాగే రెండు మల్టీడే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో సెలెక్టర్లు ప్రకటించిన వన్డే స్క్వాడ్‌లో అన్వయ్ ద్రావిడ్‌కు చోటు లభించింది. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన అన్వయ్ ద్రావిడ్.. గత కొంతకాలంగా డొమెస్టిక్ క్రికెట్‌లో, ఏజ్ గ్రూప్ టోర్నమెంట్లలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వస్తున్నాడు. కర్ణాటక అండర్-16 జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన అనుభవం అన్వయ్‌కు ఉంది. ఇప్పుడు ఏకంగా భారత జెర్సీ వేసుకుని ఇంటర్నేషనల్ లెవెల్‌లో రాణించడానికి అన్వయ్ ద్రావిడ్ రెడీ అయిపోతున్నాడు.
ఇక ఈ అండర్-19 జట్టులో మన తెలుగు రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ 'యశ్వీర్ గౌడ్' కూడా చోటు దక్కించుకోవడం విశేషం. యశ్వీర్ గౌడ్‌కు ఇటు డొమెస్టిక్ క్రికెట్‌లో మంచి గుర్తింపు ఉంది. ఇటీవల జరిగిన TG20 (తెలంగాణ టి20) వేలంలో ఇతడిని 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' జట్టు భారీ ధరకు కొనుగోలు చేసి, తన ప్రతిభను గుర్తించింది. ఇప్పుడు ఏకంగా అండర్-19 స్క్వాడ్‌లో చోటు దక్కించుకోవడంతో హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాగా, ఈ లంక పర్యటనలో జరగబోయే వన్డే మరియు మల్టీడే మ్యాచ్‌లు రెండింటికీ భారత జట్టు కెప్టెన్‌గా 'యశ్వర్ధన్ సింగ్ చౌహాన్' వ్యవహరించబోతున్నాడు.
రాహుల్ ద్రావిడ్ లాగే కొడుకు అన్వయ్ ద్రావిడ్ కూడా భారత క్రికెట్‌లో ఒక వెలుగు వెలుగుతాడా? లంక పర్యటనలో మన హైదరాబాద్ కుర్రాడు యశ్వీర్ గౌడ్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.