Vaibhav Suryavanshi: కల నిజమైన వేళ.. టీమిండియా జెర్సీ చూసి.. ఎమోషనల్ అయిన వైభవ్ సూర్యవంశీ!

వైభవ్ సూర్యవంశీ!

Update: 2026-06-23 13:13 GMT

Vaibhav Suryavanshi: టీమిండియా చిచ్చరపిడుగు.. ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ స్టార్ వైభవ్ సూర్యవంశీ కల నిజమైంది. కోట్ల మంది కలలుగనే ఆ నీలి రంగు జెర్సీ.. ఎట్టకేలకు ఈ యంగ్ సెన్సేషన్ చేతికి వచ్చింది. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసేందుకు వైభవ్ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా జెర్సీని అందుకున్న సమయంలో అతను ఎమోషనల్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ శుక్రవారం అంటే జూన్ 26న ఐర్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌తో వైభవ్ సూర్యవంశీ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇండియా జెర్సీలో వైభవ్ ఎలా కనిపిస్తాడో బీసీసీఐ తొలిసారిగా మంగళవారం (జూన్ 23న) ప్రపంచానికి చూపించింది. బీసీసీఐ పంపిన ఆ అపురూపమైన జెర్సీని అందుకున్న సూర్యవంశీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. భారత జట్టు త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు.. వైభవ్ ఇంటి తలుపు తట్టి ఆ జెర్సీ బాక్స్‌ను అందించారు. ఆ సమయంలో రఘు పాదాలకు నమస్కరించి వైభవ్ ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం ఆ కార్టన్ బాక్స్ తెరిచి.. లోపల ఉన్న ఇండియా జెర్సీని చేతుల్లోకి తీసుకుని, ఆ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ అలా చూస్తూ ఉండిపోయాడు.

ఈ అనుభూతిని నేను మాటల్లో చెప్పలేను. ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది. మొదటి రోజు నేను బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్ కోసం గ్రౌండ్‌కి వెళ్లినప్పటి నుంచి నాకున్న ఏకైక లక్ష్యం.. ఈ ఇండియా జెర్సీ ధరించడమే. ఆ టీ-షర్ట్ చూసిన క్షణం నా ముఖంలో నవ్వు ఆగలేదు. కొన్నిసార్లు మనం ఊహించని అద్భుతాలు జరుగుతాయి.. అది జరిగినప్పుడు ఎలా స్పందించాలో కూడా అర్థం కాదు. నాకు సరిగ్గా అలాగే అనిపించింది. నా క్రికెట్ జర్నీలో అతిపెద్ద అడుగు ఈరోజుతో పడింది." అంటూ వైభవ్ ఆనందం వ్యక్తం చేశాడు.

చిన్న వయసులోనే అద్భుత ప్రతిభతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ చిచ్చరపిడుగు.. ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి.

Tags:    

Similar News