Duleep Trophy 2026: భారతీయ దేశవాళీ క్రికెట్‌లో సంచలనం! దులీప్ ట్రోఫీ 2026 సీజన్‌లో ఈస్ట్ జోన్ జట్టు అదరగొట్టింది. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ జట్టు ఒక ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి, సెమీఫైనల్స్‌లోకి .

ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ జట్టు కేవలం 138 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో జట్టును ఆదుకోవడానికి షాబాజ్ అహ్మద్, సుదీప్ కుమార్ ఘరామి క్రీజులోకి వచ్చారు. ఈ ఇద్దరూ ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశారు! షాబాజ్ అహ్మద్ అద్భుతమైన సెంచరీతో చెలరేగి 167 పరుగులు చేయగా, సుదీప్ కుమార్ ఘరామి 146 పరుగులతో అదరగొట్టాడు. వీరిద్దరి వీరోచిత బ్యాటింగ్ బలాంతో ఈస్ట్ జోన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో భారీగా 467 పరుగులు సాధించింది.

ఇక బౌలింగ్‌లోనూ ఈస్ట్ జోన్ జోరు కొనసాగింది. నార్త్ ఈస్ట్ జోన్ బ్యాటర్లను ఈస్ట్ జోన్ బౌలర్లు కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో అభిజిత్ సర్కార్ కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి పతనాన్నిశాసించాడు. దీంతో నార్త్ ఈస్ట్ జోన్ కేవలం 111 పరుగులకే కుప్పకూలింది.

ఫాలో ఆన్ ఆడిన నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ కోలుకోలేకపోయింది. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్ అయింది. ఈస్ట్ జోన్ బౌలర్ అనుకుల్ రాయ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు తెరదించారు. అంతేకాదు, యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ కూడా బౌలింగ్‌లో మెరిసి రెండు వికెట్లుడాని ఖాతాలో వేసుకున్నాడు.

ఇషాన్ కిషన్ కెప్టెన్సీలోని ఈస్ట్ జోన్ జట్టు, ఈ ఏకపక్ష విజయంతో ఎంతో జోరుమీదుంది. ఇప్పుడు ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న సెమీఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ సెంట్రల్ జోన్‌తో ఈస్ట్ జోన్ తలపడనుంది. రజత్ పటీదార్ నేతృత్వంలోని సెంట్రల్ జోన్‌ను ఎదుర్కొని ఫైనల్‌లోకి అడుగుపెట్టడానికి ఈస్ట్ జోన్ సిద్ధమవుతోంది. మరి ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.

Tags: