Chris Woakes: ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ రిటైర్‌మెంట్

క్రిస్ వోక్స్ రిటైర్‌మెంట్

Update: 2025-09-29 14:51 GMT

Chris Woakes: ఇంగ్లాండ్‌కు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు తక్షణమే రిటైర్మెంట్ ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికినప్పటికీ, తాను కౌంటీ క్రికెట్ కొనసాగిస్తానని, ఫ్రాంఛైజీ క్రికెట్‌లో అవకాశాల కోసం చూస్తానని ఆయన వెల్లడించాడు.

ఈ సందర్భంగా క్రిస్ వోక్స్ సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేసింది. అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. ఇంగ్లాండ్ తరఫున ఆడాలనేది నా చిన్నప్పటి కల. నా డ్రీమ్‌ను నిజం చేసుకున్నందుకు అదృష్టవంతుడిని. ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం, మూడు సింహాలు ముద్రించి ఉన్న జెర్సీని ధరించడం.. గత 15 ఏళ్లుగా సహచరులతో మైదానంలో గడపడం మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చాయి" అని ఆయన అన్నారు. ఈ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

వోక్స్ అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్

36 ఏళ్ల క్రిస్ వోక్స్ ఇంగ్లాండ్‌కు అందించిన సేవలు మరువలేనివి. ఆయన అన్ని ఫార్మాట్లలో కలిపి 217 మ్యాచ్‌లు ఆడి 396 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ సాధించిన రెండు కీలక ప్రపంచ కప్‌ విజయాలలో ఆయన సభ్యుడిగా ఉన్నాడు:

గాయంతోనూ పోరాటం

వోక్స్ తన అంకితభావం, పోరాటస్ఫూర్తితోనూ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది భారత్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఓవల్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆయన గాయపడినా క్రీజ్‌లోకి వచ్చాడు. భుజం డిస్‌లొకేషన్ అయినప్పటికీ, ఆ గాయంతోనే ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికిన క్రిస్ వోక్స్‌కు అభిమానులు, క్రికెట్ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News