England’s Aggression: ఇంగ్లాండ్ దూకుడు..బ్రూక్, స్మిత్ సెంచరీలు

బ్రూక్, స్మిత్ సెంచరీలు;

Update: 2025-07-04 15:57 GMT

England’s Aggression: టీమిండియాతో ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతోన్న సెకండ్ టెస్టులో మూడో రోజు ఇంగ్లాండ్ దూకుడు మీద ఆడుతోంది. 56 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రావ్ లీ 19, డకెట్ డకౌట్ కాగా.. హ్యారీ బ్రూక్, జెమ్మీ స్మిత్ సెంచరీలతో చెలరేగుతున్నారు. ప్రస్తుతం క్రీజులో బ్రూక్103, జెమ్మీ స్మిత్ 130 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మరో వైపు ఇండియా చెత్త ఫీల్డింగ్ చేస్తోంది. కీలక క్యాచ్ మిస్ చేసి భారీ మూల్యం చెల్లిచుకుంటుంది. తొలి టెస్టులో చేసిన తప్పులనే ఎడ్జ్ బాస్టన్ లోనూ రిపీట్ చేస్తుంది. ఇంగ్లాండ్ బ్యాటర్లు ఎదురు దాడి చేస్తున్న సమయంలో కెప్టెన్ శుభమాన్ గిల్ ఈజీ క్యాచ్ మిస్ చేశాడు. మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 37 ఓవర్ రెండో బంతిని జడేజా బౌలింగ్ లో బ్రూక్ గట్టిగా కట్ షాట్ కొట్టాడు. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న గిల్ క్యాచ్ పట్టడంలో విఫలమయ్యాడు. బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. ఆలస్యంగా క్యాచ్ కోసం చేతులు చాచడంతో బంతి గిల్ తలకు తగిలింది. 

Tags:    

Similar News