No Place for Harman in the Team of the Tournament: వరల్డ్ కప్ గెలిపించినా.. టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో హర్మన్ కు నో ప్లేస్
టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో హర్మన్ కు నో ప్లేస్
No Place for Harman in the Team of the Tournament: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 విజేతగా భారత్‌ను నిలబెట్టిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కు ఐసీసీ ప్రకటించిన 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్లో చోటు దక్కలేదు. భారత జట్టు నుంచి ముగ్గురు క్రీడాకారిణులు ఈ జట్టులో స్థానం సంపాదించారు. స్మృతి మంధాన ఓపెనర్, జెమీమా రోడ్రిగ్స్ - బ్యాటర్, దీప్తి శర్మ ఆల్‌రౌండర్, (ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్). ఈ జట్టుకు దక్షిణాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) కెప్టెన్‌గా ఎంపికైంది. ఆమె టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు (571) చేసింది.
కెప్టెన్‌గా జట్టును గెలిపించినప్పటికీ హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్‌లో టోర్నమెంట్ మొత్తంలో (సెమీఫైనల్లో 89 పరుగుల కీలక ఇన్నింగ్స్ మినహా) తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే అభిప్రాయం ఉంది. ఆమె మొత్తం 260 పరుగులు మాత్రమే చేసింది. ఈ టీమ్‌ను వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగానే ఎంపిక చేస్తారు. ఈ జట్టును ఎంపిక చేయడానికి ఇయాన్ బిషప్, మెల్ జోన్స్ వంటి ప్రముఖ వ్యాఖ్యాతలు, ఐసీసీ ప్రతినిధులు కలిసిన ప్యానెల్ వ్యవహరించింది.
టీం ఆఫ్ ది టోర్నమెంట్
స్మృతి మంధాన (భారత్), లారా వోల్వార్డ్ట్ (సి) (దక్షిణాఫ్రికా), జెమిమా రోడ్రిగ్స్ (భారత్), మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), ఆష్లీ గార్డనర్ (ఆస్ట్రేలియా), దీప్తి శర్మ (భారత్), అన్నాబెల్ సదర్లాండ్ (ఆస్ట్రేలియా), నాడిన్ డి క్లర్క్ (దక్షిణాఫ్రికా), సిద్రా నవాజ్ (WK) (పాకిస్తాన్), అలనా కింగ్ (ఆస్ట్రేలియా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లాండ్), 12వ ప్లేయర్ నాట్ స్కైవర్ బ్రంట్ (ఇంగ్లండ్)