FIFA World Cup: 16 ఏళ్ల కల నెరవేరిన వేళ.. మాడ్రిడ్‌ వీధుల్లో మిన్నంటిన సంబరాలు!

మిన్నంటిన సంబరాలు!

Update: 2026-07-21 05:01 GMT

FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్‌ను సగర్వంగా స్వదేశానికి తీసుకొచ్చిన వేళ.. స్పెయిన్ దేశం సంబరాల్లో ఊగిపోయింది! 16 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలల కప్ కళ్లముందు ఆవిష్కృతం కావడంతో.. మాడ్రిడ్ వీధులన్నీ పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.వేలాది మంది అభిమానులు జాతీయ జెండాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, బాణసంచా కాలుస్తూ తెల్లవారుజాము వరకు వేడుకల్లో మునిగితేలారు.

"విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టు ప్రత్యేక విమానంలో మాడ్రిడ్ చేరుకోగానే అభిమానుల కేరింతలతో ఎయిర్‌పోర్ట్ హోరెత్తిపోయింది. కెప్టెన్ రోడ్రి విమానం నుంచి ట్రోఫీతో బయటకు రాగా.. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఆటగాళ్లకు ఘనంగా స్వాగతం పలికారు.సాయంత్రం మోంక్లోవా ప్యాలెస్ నుంచి సిబెలెస్ స్క్వేర్ వరకు ఓపెన్ టాప్ బస్సులో ఆటగాళ్లతో భారీ విజయ యాత్ర నిర్వహించారు. 35 డిగ్రీల తీవ్రమైన ఎండను సైతం లెక్కచేయకుండా వేలాది మంది ఫ్యాన్స్ గొడుగులు పట్టుకుని తమ హీరోలకు జైకొట్టారు.

మూడు దేశాలు.. ఆరు వారాల పోరాటం.. ఏకంగా 104 మ్యాచ్‌లు! ఫిఫా వరల్డ్‌ కప్‌ యావత్‌ ప్రపంచాన్ని ఫుట్‌బాల్‌ మాయలో పడేసింది. ఫైనల్లో ఆఖరి విజిల్‌ వేసేవరకు అభిమానులను అమితంగా అలరించింది.ఈసారి జట్ల సంఖ్యను 48కి పెంచడంతో మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగుతాయనుకున్నారంతా! కానీ కేప్‌ వెర్డే, కాంగో, కురసావో వంటి చిన్న జట్లు అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాయి. కేప్‌ వెర్డే గోల్‌కీపర్‌ వోజిన్హా అయితే ఏకంగా ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయాడు.

Tags:    

Similar News