FIFA World Cup: ఫిపా వరల్డ్ కప్ ఫైనల్ టికెట్ ధర రూ.10 లక్షలు

ఫైనల్ టికెట్ ధర రూ.10 లక్షలు

Update: 2026-04-03 02:31 GMT

FIFA World Cup: ఫుట్‌బాల్ ప్రేమికులకు పూనకాలు తెప్పించే ఫిఫా వరల్డ్ కప్ వచ్చేస్తోంది! కానీ ఈసారి ఫైనల్ మ్యాచ్ చూడాలంటే మాత్రం జేబుకు భారీ చిల్లు పడాల్సిందే. ఎందుకంటే ఫైనల్ టికెట్ ధరలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

జూన్ 11న మెక్సికో వేదికగా ఈ సాకర్ పండగ అట్టహాసంగా ప్రారంభం కానుంది. మొత్తం 48 జట్లు తలపడే ఈ మెగా టోర్నీలో.. అందరి కళ్లు జూలై 19న న్యూజెర్సీలో జరిగే ఫైనల్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. అయితే ఈ ఫైనల్ ఫైట్ కోసం టాప్ కేటగిరీ టికెట్ ధరను ఫిఫా ఏకంగా 10,990 డాలర్లుగా నిర్ణయించింది.

మన భారతీయ కరెన్సీలో దీని విలువ అక్షరాలా 10 లక్షల 22 వేల రూపాయలు! అవును, మీరు విన్నది నిజమే. ఒక్క టికెట్ ధర పది లక్షల పైమాటే. ఈ ధర చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. "ఒక్క మ్యాచ్ టికెట్ ధరతో ఇండియాలో ఒక బ్రాండ్ న్యూ కారు కొనేయొచ్చు కదా!" అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఫుట్‌బాల్ మీద ఉన్న పిచ్చితో టికెట్ల కోసం అభిమానులు ఇప్పుడే పోటీ పడుతున్నారు. మరి ఈ పది లక్షల టికెట్ కొని ఆ అద్భుతమైన ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసే అదృష్టవంతులు ఎవరో చూడాలి!

Tags:    

Similar News