Who’s the Winner: టోర్నీ చరిత్రలో తొలిసారి..విన్నర్ ఎవరు.?
విన్నర్ ఎవరు.?;
Who’s the Winner: ఇవాళ FIDE Women's World Cup Final జరగనుంది. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఫైనల్లో ఇండియాకు చెందిన ఇద్దరు కోనేరు హంపి, మరో భారత యువ గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ తో తలపడనుంది. ఇద్దరు ఇండియా ప్లేయర్లు తలపడడం ఈ టోర్నీ చరిత్రలో ఫస్ట్ టైం. ఇపుడు టైటిల్ ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ఈటోర్న మెంట్ విజేతకు దాదాపు రూ. 42 లక్షలు రన్నరప్ కు రూ.29 లక్షలు లభిస్తుంది.
కోనేరు హంపి సెమీఫైనల్‌లో ఆమె చైనాకు చెందిన లీ టింగ్జీని 5-3 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ టై-బ్రేక్‌కు వెళ్లింది, అక్కడ హంపి తన నైపుణ్యాన్ని ప్రదర్శించి విజయం సాధించింది.ఫిడే మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు చేరిన మొట్టమొదటి భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్‌గా కోనేరు హంపి చరిత్ర సృష్టించి ఫైనల్‌కు చేరింది.
కోనేరు హంపి ప్రదర్శన భారత చెస్ ప్రపంచానికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది.ఆమె భవిష్యత్తులో కూడా ఇలాగే మరిన్ని విజయాలు సాధిస్తూ దేశ కీర్తిని ఇనుమడింపజేయాలని దేశం మొత్తం కోరుకుంటుంది. కోనేరు హింపికి భారత ప్రభుత్వం నుంచి అర్జున , పద్మశ్రీ పురస్కారాలు పొందింది.