England Pile Up a Huge Score: చేతులెత్తేసిన బౌలర్లు..ఇంగ్లాండ్ భారీ స్కోర్

ఇంగ్లాండ్ భారీ స్కోర్;

Update: 2025-07-26 05:10 GMT

England Pile Up a Huge Score:  నాల్గో టెస్టులో మూడో రోజు భారత బౌలర్లు చేతులెత్తేశారు.వికెట్లు తీయడానికి చెమటోడుస్తున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్ బ్యాటర్లు జో రూట్ 150, ఓలీ పోప్ 71, బెన్ స్టోక్స్ 77 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ భారత్‌పై 186 పరుగుల ఆధిక్యంలో ఉంది.భారత్ తరఫున రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కంబోజ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 358 పరుగులకు ఆలౌట్అయిన సంగతి తెలిసిందే

ఇవాళ నాల్గో రోజు ఇంగ్లాండ్ తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తుంది. భారత్ మిగిలిన మూడు వికెట్లను త్వరగా పడగొట్టి బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంటుంది. అయితే మాంచెస్టర్‌లో వర్షం పడే అవకాశ ఉంది. భారత్ ఈ మ్యాచ్‌ను తప్పనిసరిగా గెలవాలి, ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్ గెలవడం టీమిండియాకు అత్యవసరం.

Tags:    

Similar News