Gautam Gambhir and Shubman Gill: టీమిండియా బిజీ షెడ్యూల్.. బీసీసీఐపై గంభీర్, గిల్ అసంతృప్తి!

బీసీసీఐపై గంభీర్, గిల్ అసంతృప్తి!

Update: 2026-04-22 05:38 GMT

Gautam Gambhir and Shubman Gill: ఐపీఎల్ 2026 సందడి ముగియకముందే టీమిండియా ముందు భారీ షెడ్యూల్ వచ్చి పడింది. మే 31న ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజులకే భారత జట్టు మళ్ళీ మైదానంలోకి దిగనుంది. అయితే, తీరిక లేని ఈ మ్యాచుల షెడ్యూల్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్‌లో అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దీనికి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లతో సంబంధం లేకపోవడంతో.. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి కీలక ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు దూరం కావచ్చు.

సీనియర్ల స్థానంలో దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్, ఆకిబ్ నబీ, దేవదత్ పడిక్కల్ వంటి యువ రక్తాన్ని పరీక్షించే అవకాశం ఉంది. అయితే అసలు సమస్య ఇక్కడితో తీరదు. జూన్‌లో అఫ్గానిస్థాన్‌తో సిరీస్ ముగియగానే ఐర్లాండ్ పర్యటన, ఆ వెంటనే జూలైలో ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ పోరు ఎదురుకానుంది.

జులై చివరి వారంలో జింబాబ్వే టూర్ కూడా లైన్లో ఉంది. ఇలా వరుస సిరీస్‌ల వల్ల ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురవడమే కాకుండా, గాయాల బారిన పడే ప్రమాదం ఉందని గంభీర్, గిల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఆటగాళ్ల పనిభారాన్ని తగ్గించేందుకు బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News