Gill: రోహిత్ బాటలోనే నడుస్తా...
రోహిత్ బాటలోనే;
Gill: మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తనకు స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించాడని గిల్ అన్నాడు .రోహిత్ దూకుడుగా లేనట్లు అనిపించొచ్చు కానీ వ్యూహాల పరంగా చాలా దూకుడుగా ఉంటాడని తెలిపాడు. మ్యాచ్‌కు ముందు, సిరీస్ సమయంలో ఆ తర్వాత కూడా ప్లేయర్ల నుంచి అతను ఏం కోరుకుంటున్నాడో రోహిత్ స్పష్టంగా చెబుతడు.. నేను కూడా అదే మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నా అని గిల్ అన్నాడు.
రోహిత్ ఎల్లప్పుడూ వ్యక్తుల కంటే జట్టును ముందుంచాడు. అతను ఏర్పాటు చేసిన వాతావరణాన్ని నేను కొనసాగించాలనుకుంటున్నా. రోహిత్ ఎప్పుడైనా తిట్టినా మేం మనసుకు తీసుకోలేదు. అతని వ్యక్తిత్వం అలాంటిది. అది గొప్ప లక్షణంగా నేను భావిస్తున్నా. రోహిత్ భాయ్ చాలా దృడంగా ఉంటాడు. మనపై కఠినంగా ఉన్నప్పటికీ అతని హృదయం లోపలి నుంచి అది రాలేదని మనకు అర్థమవుతుంది. కేవలం జట్టు దృక్కోణం నుంచే వస్తుందని గ్రహిస్తాం’ అని గిల్ వెల్లడించాడు.
జట్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో రోహిత్‌తో తాను రెండుసార్లు మాట్లాడానని చెప్పాడు. రాబోయే 10–15 ఏండ్లలో టీమ్ కల్చర్ ఎక్కడ ఉండాలో వివరించాడన్నాడు. ఇక విరాట్ కోహ్లీ చురుకైన నాయకత్వం నుంచి కూడా తాను చాలా నేర్చుకున్నానని తెలిపాడు. ‘నేను కోహ్లీ నేతృత్వంలో ఆడినప్పుడు అతని ఆలోచనలతో మ్యాచ్‌లను చురుకుగా ఉంచేవాడు. అది నాకు బాగా నచ్చింది. ఒక ప్లాన్ పని చేయడం లేదని భావిస్తే వెంటనే రెండో ఆలోచనతో వచ్చేవాడు. బౌలర్ నుంచి ఏం కోరుకుంటున్నాడో స్పష్టంగా చెప్పేవాడు’ అని గిల్ తెలిపాడు.