Gill-Jaiswal: అదరగొట్టిన గిల్,జైశ్వాల్ ..టీమిండియా స్కోర్ ఎంతంటే.?

టీమిండియా స్కోర్ ఎంతంటే.?;

Update: 2025-07-03 16:01 GMT

Gill-Jaiswal:ఇంగ్లాండ్ తో జరుగుతోన్న సెకండ్ టెస్టులో ఫస్ట్ డే టీమిండియా పై చేయి సాధించింది. ఓపెనర్ జైశ్వాల్ 87, శుభ్ మన్ గిల్ సెంచరీతో చెలరేగడంతో ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి310 రన్స్ చేసింది. ఆట ముగిసే సమయానికి గిల్ 114, జడేజా 41 రన్స్ తో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్‌‌ వోక్స్‌‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌‌ కోసం ఇండియా

ఇంగ్లండ్‌‌ కెప్టెన్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌ టాస్‌‌ గెలిచి ఫీల్డింగ్‌‌ ఎంచుకోగా, బ్యాటింగ్‌‌కు దిగిన ఇండియాకు ఆరంభంలో ఇంగ్లిష్‌‌ పేసర్లు చుక్కలు చూపించారు. తొలి గంటలో బాల్‌‌ ఎక్కువగా స్వింగ్ కాకపోయినా, కార్స్‌‌ (1/49) జైస్వాల్‌‌ పక్కటెముకలను లక్ష్యంగా చేసుకుని బౌన్సర్లు సంధించాడు. 59 బాల్స్‌‌లో జైస్వాల్‌‌ హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. రెండో వికెట్‌‌కు 80 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. లంచ్ తర్వాత జడేజా సూపర్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడాడు. గిల్‌‌కు ఎక్కువగా స్ట్రయికింగ్‌‌ ఇచ్చిన అతను వీలైనప్పుడల్లా బౌండ్రీలు రాబట్టాడు. కానీ ఎక్కడా చెత్త షాట్లకు పోకుండా వికెట్‌‌ను కాపాడుకున్నాడు. ఈ ఇద్దరు ఆరో వికెట్‌‌కు 99 రన్స్‌‌ జోడించడంతో ఇండియా మంచి స్థితిలో నిలిచింది.

Tags:    

Similar News