Grand Welcome for Rohit and Kohli: అడిలైడ్ లో రోహిత్,కోహ్లీకి గ్రాండ్ వెల్ కమ్

రోహిత్,కోహ్లీకి గ్రాండ్ వెల్ కమ్

Update: 2025-10-21 05:59 GMT

Grand Welcome for Rohit and Kohli: టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.అక్టోబర్‌ 23న అడిలైడ్‌ వేదికగా రెండో వన్డే ఆడనుంది. దీపావళి వేళ భారత జట్టు పెర్త్‌ నుంచి అడిలైడ్‌ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం లేదా హోటల్ వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడి, వారిని ఉత్సాహ పరిచారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఉత్సాహం చూపించారు. సాధారణంగా భారత క్రికెట్ స్టార్స్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు ఇలాంటి ఘన స్వాగతం పలుకుతుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అక్టోబర్ 19న పెర్త్‌లో జరిగిన మొదటి వన్డేలో ఆస్ట్రేలియా డక్ వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను సమం చేయడానికి టీమ్ ఇండియాకు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో నిరాశపరిచిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని చూస్తున్నారు.

Tags:    

Similar News