Australia Tour: ఆస్ట్రేలియా టూర్‌కు హార్దిక్ పాండ్యా దూరం..? రోహిత్, కోహ్లీ రీ-ఎంట్రీ..!
రోహిత్, కోహ్లీ రీ-ఎంట్రీ..!
Australia Tour: ఆసియా కప్ గెలిచి జోష్ మీద ఉన్న టీమిండియా.. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించడానికి సిద్ధమవుతోంది. ఈ టూర్‌లో భాగంగా భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అయితే ఈ పర్యటనకు సంబంధించి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఆసియా కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఆస్ట్రేలియా టూర్‌లోని వన్డే మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్‌లో గాయపడిన పాండ్యా.. ఫైనల్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆడలేదు.
పాండ్యాకు ఎడమ కాలి తొడ కండరానికి గాయం కావడం వల్ల ప్రస్తుతం అతను పూర్తి ఫిట్‌గా లేడు. అతను కోలుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు టీ20ల సిరీస్‌లో మాత్రం ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఆసియా కప్‌లో పాండ్యా పాత్ర
ఆసియా కప్‌లో హార్దిక్ పాండ్యా ఆటగాడిగా కీలక పాత్ర పోషించాడు. జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ మాత్రమే కాకుండా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌లోనూ ముఖ్యమైన పరుగులు చేశాడు. అయితే సూపర్ 4లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతను గాయానికి గురై, ఆ మ్యాచ్‌లో కేవలం ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి మైదానాన్ని వీడాడు. ఆ ఒక ఓవర్‌లో పాండ్యా ఒక వికెట్ తీశాడు.
రోహిత్, కోహ్లీ రీ-ఎంట్రీ
ఈ ఆస్ట్రేలియా టూర్‌తోనే టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నారు. వీరిద్దరూ ఇప్పటికే టీ20లు, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డేల్లో ఈ సీనియర్ ఆటగాళ్లు తిరిగి ఆడటం అభిమానులకు సంతోషాన్ని ఇచ్చే అంశం.
ఆస్ట్రేలియా టూర్ షెడ్యూల్:
వన్డే మ్యాచ్‌లు: అక్టోబర్ 19 నుంచి ప్రారంభం.
టీ20 మ్యాచ్‌లు: అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు.