Hardik Pandya Spotted with Girlfriend: ఎయిర్‌పోర్ట్‌లో ప్రియురాలితో హార్దిక్ పాండ్యా.. వీడియో వైరల్..
వీడియో వైరల్..
Hardik Pandya Spotted with Girlfriend: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే తనకు దొరికిన ఈ విరామ సమయాన్ని హార్దిక్.. కొత్త ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో భార్య నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకుని షాకిచ్చిన హార్దిక్, తాజాగా మరో మోడల్‌తో కలసి పబ్లిక్‌గా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది.
ట్విన్నింగ్ లుక్‌లో కొత్త లవ్ స్టోరీ
నటాషాతో విడాకుల తర్వాత హార్దిక్ సింగర్ జాస్మిన్ వాలియాతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ బంధం కటీఫ్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా హార్దిక్ పాండ్యా మోడల్ మహీక శర్మతో ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. ఇద్దరూ ఒకే కారులో రావడం హార్దిక్ ఆమె చేయి పట్టుకుని లోపలికి నడిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరూ నలుపు రంగు దుస్తులు, ఒకే రకమైన జాకెట్, తెల్ల షూస్ వేసుకుని ట్విన్నింగ్ లుక్‌లో కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీంతో నెటిజన్లు ఫుల్ కామెంట్లు పెడుతున్నారు. "ఇద్దరూ ఒకేలా ఉన్నారు" అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు.. "విడాకులప్పుడు నటాషాని తప్పుబట్టాం, ఇప్పుడైనా హార్దిక్ ఫ్యాన్స్ సమాధానం చెప్పాలి" అంటూ సెటైర్లు వేస్తున్నారు.