Team India Management: స్వదేశానికి హర్షిత్ రాణా.. టెస్టు నుంచి రిలీజ్

టెస్టు నుంచి రిలీజ్;

Update: 2025-06-26 04:13 GMT

Team India Management:  ఇంగ్లాండ్ తో ఫస్ట్ టెస్ట్ ఓటమి తర్వాత టీమిండియాలో కీలక మార్పులు జరుగుతున్నాయి. జులై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరగనున్న రెండో టెస్టు జట్టు ఎంపిక కసరత్తు జరుగుతోంది. ఫస్ట్ టెస్టులో ఫెయిల్ అయిన శార్దూల్ ఠాకూర్ ను, అలాగే టెస్టు సిరీస్‌ కోసం భారత జట్టు బ్యాకప్ పేసర్‌గా ఎంపికైన హర్షిత్ రాణాను మేనేజ్‌మెంట్ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. బర్మింగ్ హామ్ కు భారత జట్టు పయమైంది. అయితే ఇందులో హర్షిత్ రాణా లేడని సమాచారం. బౌలర్లంతా ఫిట్‌గా ఉన్నందున బ్యాకప్‌ పేసర్‌గా అతడు అవసరం లేదని మేనేజ్‌మెంట్ నిర్ణయంచినట్లు తెలుస్తోంది. అందుకే అతడిని భారత్‌కు తిరిగిరావాలని ఆదేశించింది!

ఆసిస్ తో రెండో టెస్టు ఆడిన రాణా.. ఇండియా-ఎ జట్టులో సభ్యుడిగా ఇంగ్లండ్లో పర్యటించాడు. కాంటర్ బరీలో ఇంగ్లండ్ లయన్స్ జరిగిన అనధికార టెస్ట్ లో 27 ఓవర్లు వేసి 99 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు.దీంతో అతన్ని టీమిండియా నుంచి తప్పించారు. ఫలితంగా రాణా జట్టుతో పాటు బర్మింగ్ హామ్ కు వెళ్లలేదు. ముకేశ్ కుమార్, అన్షుల్ కాంబోజ్ మాత్రం టీమ్ తో పాటే కొనసా గుతున్నారు. గంభీర్ శిష్యుడిగా పేరొందిన రాణా పెర్త్ లో జరిగిన మ్యాచ్లో సూపర్ ఆఫ్ కట్టర్తో ట్రావిస్ హెడను ఔట్ చేసి ఒక్క సారిగా వార్తల్లోకి ఎక్కాడు. కాలక్రమంలో అతను రెడ్ బాల్ క్రికెట్ ఆడటానికి సిద్ధంగా లేడని తేలడంతో ప్రత్యామ్నాయ బౌలర్ గా ఉపయోగించుకున్నారు.

Tags:    

Similar News