Pakistan Board as T20 World Cup Squad: పాక్ బోర్డు హైడ్రామా..టీ20 వరల్డ్ కప్ టీమ్ ప్రకటన
టీ20 వరల్డ్ కప్ టీమ్ ప్రకటన
Pakistan Board as T20 World Cup Squad: టీ20 వరల్డ్ కప్ పార్టిసిపేషన్ విషయంలోపాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హైడ్రామా ఆడుతోంది. బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా తాము కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని పరోక్షంగా హెచ్చరించిన ఒక్క రోజులోనే మెగా కప్‌కు తుది జట్టును ప్రకటించి ఆశ్చర్యపరిచింది. అయితే జట్టును ఎంపిక చేసినంత మాత్రాన టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు కాదని ఆదివారం పీసీబీ చైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ పేర్కొన్నాడు. ‘మేం ప్రభుత్వ సలహా కోసం ఎదురుచూస్తున్నాం. వాళ్లు ఎలా చెబితే అలా చేస్తాం. ఒకవేళ వరల్డ్ కప్‌లో ఆడొద్దని చెబితే దాన్నే పాటిస్తాం’ అని చెప్పాడు. ఇ క జట్టు విషయానికొస్తే.. గతేడాది ఆసియా కప్‌కు దూరమైన బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, నసీమ్ షాను మళ్లీ జట్టులోకి తీసుకున్నారు. హారిస్ రవూఫ్, మహ్మద్ వసీమ్ జూనియర్‌పై వేటు పడింది.
పాక్ జట్టు: సల్మాన్ ఆగా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజమ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజ నఫే, మహ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారిక్.