Hitman Rohit Sharma: రిటైర్మెంట్ వార్తలపై హిట్‌మ్యాన్ సంచలన వ్యాఖ్యలు

సంచలన వ్యాఖ్యలు

Update: 2026-07-20 11:43 GMT

Hitman Rohit Sharma: లార్డ్స్ వన్డే మ్యాచ్ ముగిశాక హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేస్తాడు! ఇక 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలనే అతని కల నెరవేరదు! ..ఇంగ్లాండ్‌తో మూడో వన్డేకు ముందు సోషల్ మీడియాలో వినిపించిన ఊహాగానాలు ఇవి.

కానీ వీటన్నింటికీ లార్డ్స్ వేదికగా తన బ్యాట్‌తోనే గట్టి సమాధానం చెప్పాడు రోహిత్ శర్మ! క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు. ఈ చారిత్రాత్మక శతకంతో విమర్శకుల నోళ్లు మూయించడమే కాదు.. తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలను పూర్తిగా కొట్టిపడేశాడు.

మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. 'నా పని మైదానంలోకి వెళ్లి బ్యాట్‌తో దేశానికి ప్రాతినిధ్యం వహించడం. నేను అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇలాంటి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. బయట ఇలాంటి శబ్దాలు లేకపోతే అసలు మజానే ఉండదు! నా ఫోకస్ అంతా జట్టు విజయంపైనే ఉంది' అంటూ ఘాటుగా స్పందించాడు.

Tags:    

Similar News