Gambhir’s Interesting Comments: ఆ ఓటమి జీవితంలో మర్చిపోలేను.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Update: 2025-10-11 13:09 GMT

Gambhir’s Interesting Comments: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లాంటి పెద్ద టైటిల్స్ గెలిచాడు. అయితే కోచింగ్‌ కెరీర్ ఆరంభంలో ఎదురైన తీవ్రమైన ఓటమిని మాత్రం తాను ఎప్పటికీ మర్చిపోలేనని గంభీర్ తాజాగా తెలిపాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా గంభీర్ ఈ విషయాలను పంచుకున్నారు.

న్యూజిలాండ్ సిరీస్.. గుణపాఠం నేర్పింది..

‘‘నా కోచింగ్ కెరీర్ ముగిసినా సరే... జీవితాంతం న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను నేను మర్చిపోలేను. ఆ ఓటమిని మన కుర్రాళ్లకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటా. గతాన్ని మర్చిపోతే, దేనినైనా తేలికగా తీసుకునే ప్రమాదం ఉంటుంది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు అనే విషయాన్ని ఆ సిరీస్ మాకు నేర్పింది.’’ అని గంభీర్ తన అనుభవాన్ని పంచుకున్నారు.

విదేశాల్లో గెలిస్తేనే టాప్ టీమ్

గంభీర్ యువ జట్టుపై ప్రశంసలు కురిపిస్తూ.. కేవలం స్వదేశంలో గెలిస్తేనే సరిపోదని.. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా మారాలంటే విదేశాల్లోనూ గెలవడం చాలా ముఖ్యమని అన్నారు. "ఇంగ్లాండ్‌తో సిరీస్ మాకు చాలా కఠినమైన పరీక్ష. పెద్దగా అనుభవం లేని యువ జట్టుతో అక్కడికి వెళ్ళాం. మేం కేవలం రిజల్ట్స్ చూడలేదు. ఎలా పోరాటం చేశాం అనేదే కీలకం. విదేశాల్లో గెలవకపోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవడం అసాధ్యం’’ అని అన్నారు.

గిల్‌పై గంభీర్ ప్రశంసలు

యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీని గంభీర్ గట్టిగా సమర్థించారు. "మేం 25 ఏళ్ల వయసులోనే గిల్‌ను టెస్టు సారథిని చేశాం. అప్పుడే అతడికి ఒకటే చెప్పా.. 'నువ్వు లోతైన సముద్రంలోకి నెట్టబడ్డావు. ఇప్పుడు నువ్వు గొప్ప స్విమ్మర్ అవ్వాలా.. మునిగిపోవాలా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. కెప్టెన్‌గా గిల్ చేసిన 750+ పరుగుల కంటే, ఆ ఒత్తిడిని తట్టుకొని జట్టును నడిపించిన తీరే నాకు బాగా నచ్చింది. ఇంగ్లాండ్‌తో రెండు నెలల కఠిన సిరీస్‌ను అతడు చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు.

ఓవల్ టెస్ట్ తర్వాత నేను గిల్‌తో నువ్వు కఠినమైన టెస్టులో పాస్ అయ్యావు. ఇక నుంచి అంతా సులువుగానే మారుతుంది అని చెప్పా. బయటి విమర్శలను అస్సలు పట్టించుకోవద్దని గిల్‌కు సలహా ఇస్తా" అని గంభీర్ అన్నారు. తెలిపారు.

Tags:    

Similar News