Tilak Varma: నాకు అప్పటి వరకు నిద్రపట్టదు:తిలక్ వర్మ

నిద్రపట్టదు:తిలక్ వర్మ

Update: 2025-10-01 03:41 GMT

Tilak Varma: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత విజయం సాధించిన తర్వాత తిలక్ వర్మ తన ప్రదర్శన గురించి మీడియాతో మాట్లాడారు. ఆ మ్యాచ్‌లో తనపై ఒత్తిడి ఎలా ఉండేది, దాన్ని ఎలా అధిగమించాననే విషయాలను ఆయన పంచుకున్నారు.

పాకిస్థాన్ ఆటగాళ్లు మమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. కానీ వారికి గెలిచి చూపించడమే సరైన సమాధానం అని నాకు తెలుసు. మా జట్టు కూడా అదే చేసింది."దేశం కోసం ఆడుతున్నాను: "ఆట సమయంలో చాలా ఒత్తిడి ఉంది. కానీ నేను నా దేశం కోసం ఆడుతున్నాను. ఒకవేళ నేను ఒత్తిడికి లొంగిపోతే, 140 కోట్ల మంది భారతీయులను నిరాశపరిచినట్టే అని భావించాను."తన చిన్ననాటి కోచ్‌లు సలామ్ బయష్ , పృథ్వీ సార్ తనకు ఎంతగానో సహకరించారని, వారి మార్గదర్శకత్వమే ఈ స్థాయిలో ఆడటానికి సహాయపడిందని తిలక్ వర్మ అన్నారు.

"నా తదుపరి లక్ష్యం టీ20 ప్రపంచకప్ గెలవడమే. ప్రపంచకప్ గెలిచే వరకు నాకు నిద్ర పట్టదు" అని తిలక్ వర్మ తెలిపారు. తన ప్రదర్శన గురించి తిలక్ వర్మ మాట్లాడుతూ, ఒత్తిడిని అధిగమించి మ్యాచ్ గెలవడానికి తాము భాగస్వామ్యాలు నిర్మించుకోవడమే కారణమని చెప్పారు. ఈ విజయంతో హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తిలక్ వర్మకు అద్భుతమైన స్వాగతం లభించింది.

Tags:    

Similar News