ICC Men's T20 World Cup: టీ20 వరల్డ్ కప్: అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ..ఫైనల్ కు న్యూజిలాండ్

ఫైనల్ కు న్యూజిలాండ్

Update: 2026-03-05 03:21 GMT

ICC Men's T20 World Cup: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా మొదటి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా స్కోరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.

ప్రోటీస్ జట్టులో మార్కో జాన్సెన్ అర్థ శతకంతో చెలరేగగా, డెవాల్డ్ బ్రెవిస్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (29) రాణించడంతో కివీస్ ముందు 170 పరుగులు టార్గెట్ పెట్టింది.

మార్కో జాన్సెన్ చివర్లో మెరుపులు మెరిపించినప్పటికీ అది సరిపోలేదు.

టార్గెట్ బరిలో న్యూజిలాండ్ 12.5 ఓవర్లలోనే 173 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. ఇది టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ. ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్ మొదటి వికెట్‌కు మెరుపు వేగంతో పరుగులు జోడించి న్యూజిలాండ్ విజయానికి బలమైన పునాది వేశారు. దీంతో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో విజయం (43 బంతులు మిగిలి ఉండగానే) విజయం సాధించింది.

టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటివరకు సౌతాఫ్రికాపై ఒక్కసారి కూడా గెలవని న్యూజిలాండ్, అత్యంత కీలకమైన సెమీ ఫైనల్లో ఆ రికార్డును తిరగరాసింది.న్యూజిలాండ్ జట్టు ఇప్పుడు మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ పోరులో పాల్గొంటుంది. ఇవాళ జరగబోయే భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ విజేతతో న్యూజిలాండ్ తలపడనుంది.

Tags:    

Similar News