ICC T20 Batting Rankings: ఫామ్ లో లేకపోయినా..టాప్ లోనే అభిషేక్

టాప్ లోనే అభిషేక్

Update: 2026-03-05 03:26 GMT

ICC T20 Batting Rankings: ఐసీసీవిడుదల చేసిన టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ (2026)లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, గతంలో సాధించిన భారీ రేటింగ్ పాయింట్లు అతడిని నంబర్ 1 స్థానంలోనే కొనసాగుతున్నాడు.ప్రస్తుతం అభిషేక్ శర్మ 874 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

పాకిస్థాన్‌కు చెందిన సాహిబ్జాదా ఫర్హాన్ ఈ ప్రపంచకప్‌లో రెండు సెంచరీలతో అద్భుత ఫామ్‌లో ఉండి, 848 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకొచ్చాడు. వీరిద్దరి మధ్య తేడా కేవలం 26 పాయింట్లు మాత్రమే. ఈ టోర్నీలో అభిషేక్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌ల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు (సగటు 13.33). ఇందులో వరుసగా మూడు సార్లు డకౌట్ అవ్వడం గమనార్హం. కేవలం జింబాబ్వేపై చేసిన 55 పరుగులు మాత్రమే కాస్త ఊరటనిచ్చాయి.

ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో 15వ స్థానం నుండి 4వ స్థానానికి వచ్చాడు. తిలక్ వర్మ 5వ స్థానం, సూర్యకుమార్ యాదవ్ 6వ స్థానం,వరుణ్ చక్రవర్తి బౌలింగ్ విభాగంలో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు.

Tags:    

Similar News