Krish Takes a Dig : ఇలా ఆడితే భవిష్యత్తులో కెప్టెన్ అవుతాడు!".. వైస్ కెప్టెన్ తిలక్ వర్మపై క్రిష్ సెటైర్లు

క్రిష్ సెటైర్లు

Update: 2026-07-09 10:37 GMT

Krish Takes a Dig : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఇప్పుడు డూ-ఆర్-డై సిట్యుయేషన్ వచ్చేసింది. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో భారత్ ఓడిపోవడంతో.. సిరీస్ కోల్పోయే ప్రమాదం ముంగిట నిలిచింది. కనీసం సిరీస్‌ను సమం చేయాలన్నా.. ఇప్పుడు జరగబోయే నాలుగో టీ20లో భారత్ కచ్చితంగా గెలిచి తీరాల్సిందే.ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టే తుది జట్టు (Playing XI) ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ ఫామ్‌పై మాజీల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది.

భారత మాజీ చీఫ్ సెలెక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్.. తిలక్ వర్మ ఆటతీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్న తిలక్‌ను పక్కన పెట్టి, సంజు శాంసన్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న తిలక్ వర్మపై క్రిష్ తనదైన శైలిలో చురకలంటించారు.

క్రిష్ ఏమన్నారంటే..."తిలక్ వర్మ ఇప్పుడు జట్టుకు వైస్ కెప్టెన్. ఇలాగే నెమ్మదిగా ఆడితే భవిష్యత్తులో కెప్టెన్ కూడా అయిపోతాడు! అతడు క్రీజ్ లొకి వస్తే కేవలం అవుట్ కాకూడదనే ఆడుతున్నట్టు ఉంది తప్ప.. స్కోర్ పెంచాలనే ఉద్దేశం కనిపించట్లేదు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడానికి తిలక్ ఇబ్బంది పడుతున్నాడని మేనేజ్‌మెంట్‌కు కూడా తెలుసు. అందుకే అతడి కంటే ముందే అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపించారు. ఆ ఇబ్బంది పోవాలంటే తిలక్‌ను కాస్త జట్టు నుంచి తప్పించాలి. ప్రస్తుతం తిలక్ కంటే సంజు శాంసన్‌ను ఆడించడమే బెస్ట్ ఆప్షన్!

అయితే.. క్రిష్ ఇలా ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటే.. టీమ్ ఇండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ మాత్రం భిన్నంగా స్పందించారు. ఒత్తిడిలో ఉన్న జట్టులో ఇప్పుడు ఎలాంటి మార్పులు చేయకుండా.. అదే టీమ్‌ను కొనసాగించాలని ఆయన సూచించడం గమనార్హం.

Tags:    

Similar News