India Begins First Test Against South Africa: ఇవాళే సఫారీలతో ఇండియా తొలి టెస్ట్
ఇండియా తొలి టెస్ట్
India Begins First Test Against South Africa: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో ఇవాళ్టి నుంచి టీమ్ఇండియా తొలి టెస్టు ఆడనుంది.ఇది ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) సైకిల్‌లో భాగంగా జరుగుతున్న 2 మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటిది. ఈ సిరీస్‌లోని రెండవ టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22న గౌహతిలోని బర్సపారా స్టేడియంలో జరగనుంది. ఈడెన్‌లో 42 మ్యాచులు ఆడిన భారత్ 13 గెలిచి, 9 ఓడగా మరో 20 మ్యాచులు డ్రాగా ముగిశాయి. చివరగా 2019లో BANతో జరిగిన టెస్టులో భారత్ గెలిచింది. అయితే ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ SAను తక్కువ అంచనా వేయొద్దని గిల్ సేన భావిస్తోంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
సౌతాఫ్రికా: టెంబా బవూమ (కెప్టెన్), ఐడెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టాన్ స్టబ్స్, టోనీ డి జార్జి, కైల్ వెరెన్, సెనురన్ ముత్తుస్వామి, సిమోన్ హార్మర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ.