World Junior Badminton Championship: జూనియర్ బ్యాడ్మింటన్‌లో భారత్ సంచలనం.. పతకాలపై కన్ను..!

పతకాలపై కన్ను..!

Update: 2025-10-13 08:52 GMT

World Junior Badminton Championship: ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించిన భారత క్రీడాకారులు ఇప్పుడు వ్యక్తిగత పోటీలపై దృష్టి పెట్టారు. సోమవారం నుంచి వ్యక్తిగత విభాగంలో మ్యాచ్‌లు మొదలు కానున్నాయి.

గత రికార్డు: ఈ టోర్నీలో మన దేశం తరఫున అత్యుత్తమంగా.. 17 ఏళ్ల క్రితం సైనా నెహ్వాల్ బాలికల సింగిల్స్‌లో స్వర్ణం, గురుసాయి దత్ కాంస్యం సాధించారు. ఇప్పటివరకు భారత్‌ మొత్తం 11 పతకాలు గెలుచుకుంది.

బాలికల సింగిల్స్‌ : ఈసారి మరో స్వర్ణం వస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు. అందుకు కారణం.. ప్రపంచ జూనియర్‌ నంబర్‌వన్‌గా ఉన్న తన్వి శర్మ, చైనా ఓపెన్‌ క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లిన ఉన్నతి హుడా బరిలో ఉండటమే. వెన్నెల కలగొట్ల, రక్షితశ్రీ కూడా ఈ విభాగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

బాయ్స్ సింగిల్స్‌ : రౌనక్‌ చౌహాన్, జ్ఞాన దత్తులపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

బాయ్స్ డబుల్స్‌ : అరిగెల భార్గవ రామ్‌- గొబ్బూరు విశ్వ తేజ జోడీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో పతకం సాధించిన ఉత్సాహంతో, ఈ యువ క్రీడాకారులు వ్యక్తిగత విభాగంలో కూడా మరిన్ని పతకాలు గెలుస్తారని భారత క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

Tags:    

Similar News