Vaibhav Suryavanshi: జింబాబ్వే టూర్ కు టీమిండియా..వైభవ్ కు చాన్స్ వచ్చేనా.?
వైభవ్ కు చాన్స్ వచ్చేనా.?
Vaibhav Suryavanshi: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్! జింబాబ్వే పర్యటనకు సంబంధించి టీమ్ ఇండియా షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా విడుదల చేసింది.ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య జింబాబ్వే జట్టుతో టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మ్యాచులన్నీ హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరగనున్నాయి. భారత్-జింబాబ్వే మధ్య మూడు టీ20ల సిరీస్ కేవలం నాలుగు రోజుల వ్యవధిలో జరగనుంది. జూలై 23, 25, 26వ తేదీల్లో ఈ రసవత్తర పోరు సాగనుంది. .భారత్, జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు జింబాబ్వే గడ్డపై సత్తా చాటడానికి సిద్ధమవుతోంది.
ఐపీఎల్-2026లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచే యంగ్ క్రికెటర్లను కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఏదేమైనప్పటికి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మాత్రం భారత సీనియర్ జట్టు తరపున పిలుపు రావడం దాదాపు ఖాయమని పిస్తోంది.
కేవలం భారత్ మాత్రమే కాదు.. జింబాబ్వే జట్టు కూడా త్వరలోనే భారత్‌లో పర్యటించనుంది. జనవరి 2027లో మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే టీమ్ ఇండియాకు రానున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. జింబాబ్వే గడ్డపై టీమ్ ఇండియా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా? చూడాలి.