India Suffers Its First Defeat of the Year: ఏడాది భారత్ కు తొలి ఓటమి
భారత్ కు తొలి ఓటమి
India Suffers Its First Defeat of the Year: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో ఇండియా ఓటమి పాలైంది. 3 వన్డేల సిరీస్ లో మొదటి వన్డేలో ఆస్ట్రేలియా (DLS పద్ధతి ప్రకారం) 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌కు పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో, మ్యాచ్‌ను ప్రతి జట్టుకు 26 ఓవర్లకు కుదించారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది.భారత్ టాప్ ఆర్డర్ (రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్) త్వరగా వికెట్లు కోల్పోయారు.
కేఎల్ రాహుల్ (38 పరుగులు) ,అక్షర్ పటేల్ (31 పరుగులు) కొద్దిగా ప్రతిఘటించారు. వర్షం కారణంగా డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్ (DLS) పద్ధతిలో ఆస్ట్రేలియా లక్ష్యం 131 పరుగులుగా నిర్ణయించబడింది.
ఆస్ట్రేలియా కేవలం 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.కెప్టెన్ మిచెల్ మార్ష్ (46 నాటౌట్) , జోష్ ఫిలిప్ (37) రాణించారు. ఈ ఓటమితో ఆస్ట్రేలియా సిరీస్‌లో 1−0 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఏడాది వన్డేలలో భారత్‌కు ఇది తొలి ఓటమి.