Fourth T20 Today Against South Africa: ఇవాళ సఫారీలతో భారత్ నాల్గో టీ20

భారత్ నాల్గో టీ20

Update: 2025-12-17 06:19 GMT

Fourth T20 Today Against South Africa: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నోలో రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. నేటి మ్యాచ్ గెలిస్తే టీమ్ ఇండియా సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. గత మ్యాచ్ (ధర్మశాల)లో ఘనవిజయం సాధించిన ఉత్సాహంతో ఉన్న సూర్యకుమార్ యాదవ్ సేన, ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను ముగించాలని చూస్తోంది.

ఈ సీజన్‌‌‌‌లో టీ20 ఫార్మాట్‌‌‌‌లో 15 కంటే తక్కువ సగటు నమోదు చేసిన సూర్య.. ఒక్క హాఫ్‌‌‌‌ సెంచరీ కూడా చేయలేదు. ప్రతీ మ్యాచ్‌‌‌‌లో 20 బాల్స్‌‌‌‌ కంటే ఎక్కువగా ఆడలేకపోతున్నాడు. ఇతర ఫార్మాట్లలో రాణిస్తున్న గిల్‌‌‌‌.. షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో కుదురుకోకపోవడం సెలెక్టర్లను, మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఆందోళనలో పడేసింది. ఓపెనింగ్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ దూకుడు ముందు తేలిపోవడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌లో ఉండటం, బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి రాణిస్తుండటం భారత్‌కు ప్లస్ పాయింట్. గాయం నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్ ప్రదర్శనపై అందరి కళ్లు ఉన్నాయి. గత టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నుంచి ఇప్పటి వరకు ఆడిన 28 మ్యాచ్‌‌‌‌ల్లో సఫారీ టీమ్ 18 సార్లు ఓడటం గమనార్హం. ఒకరిద్దరు మెరుస్తున్నా సమష్టిగా విజయాలు అందుకోవడంలో సఫారీలు ఫెయిలవుతున్నారు. లక్నో పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు, స్లో బౌలర్లకు సహకరిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచు (Dew) ప్రభావం ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News