Cricket: అందరూ పడుకున్నాక భారత్ Vs ఇంగ్లాండ్ రెండో టీ20 స్టార్ట్..

భారత్ Vs ఇంగ్లాండ్ రెండో టీ20 స్టార్ట్..;

Update: 2025-07-01 06:35 GMT

Cricket:  భారత మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్ ఆడుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 97 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ లేకపోవడంతో స్మృతి మంధాన కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. తొలి మ్యాచ్ లో ఆమె అద్భుత సెంచరీతో టీమ్ గెలవడంతో కీలక పాత్ర పోషించింది. ఇవాళ జరిగే రెండో మ్యాచ్‌లో కూడా విజయాల పరంపరను కొనసాగించాలని టీమిండియా చూస్తోంది. మరోవైపు సొంతగడ్డపై దారుణమైన ఓటమితో కుంగిపోతున్న ఇంగ్లాండ్ జట్టు కూడా తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.

తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ ప్రదర్శన కనబరిచింది. ముగ్గురు బ్యాట్స్‌మెన్ తప్ప, మిగిలిన వారు పెద్దగా రాణించకపోయినా.. స్మృతి మంధాన సెంచరీ సాధించి, జట్టుకు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత బౌలింగ్ ,ఫీల్డింగ్‌లో సమిష్టి ప్రదర్శనతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడుతుందా?

గాయం కారణంగా మొదటి టీ20 మ్యాచ్‌కు దూరమైన హర్మన్‌ప్రీత్ కౌర్ రెండో మ్యాచ్‌లో ఆడుతుందా లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. హర్మన్‌ప్రీత్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి వస్తే, బ్యాటింగ్ విభాగం మరింత బలపడుతుంది. అయితే ఆమె గాయం నుంచి కోలుకోకపోతే, మొదటి మ్యాచ్ లాగే రెండో మ్యాచ్ లోనూ స్మృతి జట్టుకు నాయకత్వం వహిస్తుంది.

భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఇవాళ బ్రిస్టల్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. క్రికెట్ ఫ్యాన్స్ అర్ధరాత్రి వరకు మేల్కొని ఈ మ్యాచ్ చూడాల్సి ఉంటుంది. ఈ T20 మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. సోనీ లివ్‌లో కూడా మ్యాచ్‌ను చూడవచ్చు.

Tags:    

Similar News