Trending News

India vs New Zealand T20 series: న్యూజిలాండ్ తో రెండో టీ20లో ఇండియా రికార్డ్ విక్టరీ

ఇండియా రికార్డ్ విక్టరీ

Update: 2026-01-24 08:37 GMT

India vs New Zealand T20 series: రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్) వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ఆరంభంలోనే సంజూ శాంసన్ (6), అభిషేక్ శర్మ (0) వికెట్లు కోల్పోయి 6/2తో కష్టాల్లో పడింది. అయితే ఇషాన్ కిషన్ (76 - 32 బంతుల్లో),కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (82 - 37 బంతుల్లో)* కివీస్ బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్‌ను ఏకపక్షం చేశారు.

200 పైచిలుకు లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి భారత్ ఘనత సాధించింది. టీ20 చరిత్రలో 200+ లక్ష్యాన్ని అతి తక్కువ ఓవర్లలో ఛేదించిన రికార్డుల్లో ఇది ఒకటిగా నిలిచింది. కివీస్‌పై టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (21 బంతుల్లో) నమోదు చేసిన భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ రికార్డు సృష్టించాడు.

ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన కివీస్‌‌‌‌‌‌‌‌కు ఓపెనర్లు డెవాన్‌‌‌‌‌‌‌‌ కాన్వే (19), టిమ్‌‌‌‌‌‌‌‌ సిఫర్ట్‌‌‌‌‌‌‌‌ (24) మెరుపు ఆరంభాన్నిచ్చారు. అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ వేసిన తొలి ఓవర్‌‌‌‌‌‌‌‌లో కాన్వే మూడు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌‌‌‌‌ బాదాడు. తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో పాండ్యా ఒక ఫోర్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టగా.. మూడో ఓవర్‌‌‌‌‌‌‌‌లో సిఫర్ట్‌‌‌‌‌‌‌‌ నాలుగు ఫోర్లతో రెచ్చిపోయాడు. కివీస్ బ్యాటర్లలో మిచెల్ సాంట్నర్ (47*), రచిన్ రవీంద్ర (44) రాణించారు. 18వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో 6, 4, 4 కొట్టిన శాంట్నర్‌‌‌‌‌‌‌‌ తర్వాతి ఓవర్‌‌‌‌‌‌‌‌లో 4, 4, 4, బాదాడు. ఆఖరి ఓవర్‌‌‌‌‌‌‌‌లో ఫౌల్క్స్‌‌‌‌‌‌‌‌ (15 నాటౌట్‌‌‌‌‌‌‌‌) 4, 6, 4 దంచడంతో కివీస్‌‌‌‌‌‌‌‌ స్కోరు రెండొందలు దాటింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (2/35) కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని నియంత్రించాడు.తన మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చిన ఇషాన్ కిషన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. సిరీస్‌లో మూడో టీ20 ఆదివారం (జనవరి 25) గౌహతిలో జరగనుంది.

Tags:    

Similar News