India vs South Africa: భారత్,సౌతాఫ్రికా నాల్గో టీ 20రద్దు
నాల్గో టీ 20రద్దు
By : PolitEnt Media
Update: 2025-12-18 06:30 GMT
India vs South Africa: భారత్ , దక్షిణాఫ్రికా మధ్య నిన్న లక్నోలోని ఏకనా స్టేడియంలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ రద్దయింది.స్టేడియం చుట్టూ దట్టమైన పొగమంచు, కమ్మేయడం వల్ల విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. దీనివల్ల కనీసం టాస్ వేయడానికి కూడా వీలుపడలేదు.అంపైర్లు మైదానాన్ని పలుమార్లు (సుమారు 6 సార్లు) పరిశీలించారు. చివరకు రాత్రి 9:30 గంటల సమయంలో మ్యాచ్‌ను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో మ్యాచ్ రద్దు కావడంతో, భారత్ ఈ సిరీస్‌ను కోల్పోయే అవకాశం లేదు సిరీస్‌లో చివరిదైన ఐదో టీ20 మ్యాచ్ డిసెంబర్ 19 (శుక్రవారం) న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.