Indian cricket team head coach and former MP Gautam Gambhir: గంభీర్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట

హైకోర్టులో ఊరట

Update: 2025-11-22 06:20 GMT

Indian cricket team head coach and former MP Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది.కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ సమయంలో, గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ అనుమతి లేకుండా మందులు (Favipiravir వంటి కోవిడ్ మందులు) నిల్వ చేసి, పంపిణీ చేసిందన్న ఆరోపణలపై డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ క్రిమినల్ కేసు నమోదు చేసింది.ఇది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.దీనిపై కింది కోర్టు (మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు) గంభీర్‌తో పాటు, అతని తల్లి, భార్య , ఫౌండేషన్ CEO లకు సమన్‌లు జారీ చేసింది.

జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ కేసులో గౌతమ్ గంభీర్ , అతని ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది.ఫౌండేషన్ తరఫు న్యాయవాదులు వాదిస్తూ, మందుల పంపిణీ అనేది లాభాపేక్ష లేని పూర్తిగా సేవా కార్యక్రమం అని, అధీకృత డీలర్ల నుంచే కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా అందించామని కోర్టుకు విన్నవించారు.కోర్టు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకొని, గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసును మరియు కింది కోర్టు జారీ చేసిన సమన్‌లను రద్దు చేసింది.ఈ తీర్పుతో గంభీర్ కుటుంబానికి మరియు ఫౌండేషన్‌కు ఈ కేసు నుంచి పూర్తి ఉపశమనం లభించింది.

Tags:    

Similar News