Indian Premier League: ఆర్బీబీ వర్సెస్ సన్ రైజర్స్..ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ రిలీజ్

ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ రిలీజ్

Update: 2026-03-12 07:19 GMT

Indian Premier League: ఐపీఎల్ 19వ సీజన్ (IPL 2026)కు సంబంధించిన మొదటి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) అధికారికంగా విడుదల చేసింది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ప్రస్తుతం కేవలం మొదటి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరులో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది.

తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారైన తర్వాత మిగిలిన పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేస్తుంది.మొదటి దశలో (ఏప్రిల్ 12 వరకు) మొత్తం 4 డబుల్ హెడర్ మ్యాచ్‌లు (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3:30 గంటలకు, రాత్రి మ్యాచ్‌లు 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5న ఒకే ఒక మ్యాచ్ (SRH vs LSG) జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తమ మొదటి హోమ్ మ్యాచ్‌లను గువాహటిలో, పంజాబ్ కింగ్స్ న్యూ చండీగఢ్‌లో ఆడనున్నాయి. ఈ సీజన్‌లో మొత్తం మ్యాచ్‌ల సంఖ్య 84కు పెరిగింది.

ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్:

మార్చి 28: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్‌రైజర్స్ హైదరాబాద్ ( బెంగళూరు)– రాత్రి 7: 30

మార్చి 29: ముంబై ఇండియన్స్ vs కేకేఆర్ (ముంబై) – రాత్రి 7:30 గంటలకు

మార్చి 30: రాజస్థాన్ రాయల్స్ vs సీఎస్‌కే (గువహటి) – రాత్రి 7:30 గంటలకు

మార్చి 31: పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ (ముల్లన్‌పూర్) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 1: లక్నో సూపర్ జెయింట్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ (లక్నో) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 2: కేకేఆర్ vs ఎస్‌ఆర్‌హెచ్ (కోల్‌కతా) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 3: సీఎస్‌కే vs పంజాబ్ కింగ్స్ (చెన్నై) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 4: ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ) – మధ్యాహ్నం 3:30 గంటలకు

ఏప్రిల్ 4: గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ (అహ్మదాబాద్) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 5: ఎస్‌ఆర్‌హెచ్ vs లక్నో సూపర్ జెయింట్స్ (హైదరాబాద్) – మధ్యాహ్నం 3:30 గంటలకు

ఏప్రిల్ 5: ఆర్‌సీబీ vs సీఎస్‌కే (బెంగళూరు) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 6: కేకేఆర్ vs పంజాబ్ కింగ్స్ (కోల్‌కతా) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 7: రాజస్థాన్ రాయల్స్ vs ముంబై ఇండియన్స్ (గువహటి) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 8: ఢిల్లీ క్యాపిటల్స్ vs గుజరాత్ టైటాన్స్ (ఢిల్లీ) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 9: కేకేఆర్ vs లక్నో సూపర్ జెయింట్స్ (కోల్‌కతా) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 10: రాజస్థాన్ రాయల్స్ vs ఆర్‌సీబీ (గువహటి) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 11: పంజాబ్ కింగ్స్ vs ఎస్‌ఆర్‌హెచ్ (ముల్లన్‌పూర్) – మధ్యాహ్నం 3:30 గంటలకు

ఏప్రిల్ 11: సీఎస్‌కే vs ఢిల్లీ క్యాపిటల్స్ (చెన్నై) – రాత్రి 7:30 గంటలకు

ఏప్రిల్ 12: లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ (లక్నో) – మధ్యాహ్నం 3:30 గంటలకు

ఏప్రిల్ 12: ముంబై ఇండియన్స్ vs ఆర్‌సీబీ (ముంబై) – రాత్రి 7:30 గంటలకు

Tags:    

Similar News