India Hockey Team: ఇవాళ ఆస్ట్రేలియాతో ఇండియా కీలక మ్యాచ్
ఇండియా కీలక మ్యాచ్;
India Hockey Team: ఇండియా హాకీ టీమ్.. ఎఫ్ఎహెచ్ ప్రో లీగ్ లో మరో పోరుకు సిద్ధమైంది. ఇవాళ జరిగే కీలక మ్యాచ్ లో బలమైన ఆస్ట్రేలియాతో తలపడనుంది. యూరోప్ లీగ్ లో ఆడిన మ్యాచ్‌లో ఇండియా తీవ్రంగా నిరాశపర్చింది. ఒలింపిక్ చాంపియన్ నెదర్లాండ్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లోనూ 1-2, 2-3తో ఓడింది. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో నూ వైఫల్యాలనే పునరావృతం చేసింది. ప్రస్తుతం ఈ లీగ్ లో ఆడిన 12 మ్యాచ్‌లో 15 పాయింట్లతో ఐదో ప్లేస్‌లో ఉన్న ఇండియా.. ఆసీస్ పై గెలిస్తేనే టాప్-3లో కొనసాగే చాన్స్ ఉంటుంది.
ఆసీస్ పై గెలవడం మాకు చాలా కీలకం. పాయింట్ల పరంగానే కాకుండా జట్టు విజయాలబాట పట్టడానికి కూడా ఇది చాలా అవసరం. గత నాలుగు మ్యాచ్ ల్లో విజయానికి దగ్గరగా వచ్చినా చివర్లో తడ బడ్డాం. ఆ స్ట్రాటజీని మార్చి కొత్త ఆట ఆడాలి అని
కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ వెల్లడించాడు. పేలవమైన పెనాల్టీ కార్నర్లు. ఆలస్యంగా గోల్స్ చేయడం, డిఫె న్స్ లో పొరపాట్లను సరిదిద్దుకుంటే ఈ మ్యాచ్‌లో ఇండియాను విజయం వరించొచ్చు. పారిస్ ఒలిం పిక్స్ లీగ్ దశలో ఆసీస్ ను ఓడించిన ఇండియా అదే ఆటను రిపీట్ చేయాలని భావిస్తోంది.