International Cricket Council Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా ప్లేయర్ల జోరు

టీమిండియా ప్లేయర్ల జోరు

Update: 2026-03-19 03:30 GMT

International Cricket Council Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇండియన్ స్టార్ ప్లేయర్లు సత్తాచాటారు. వన్డే ఫార్మాట్లో న్యూజిలాండ్ బ్యాటర్ మిచెల్ తొలి స్థానంలో నిలవగా.. భారత బ్యాటర్లు కోహ్లి(2), రోహిత్ (4), గిల్ (5), రాహుల్ (9) టాప్ 10లో ఉన్నారు. బౌలింగులో భారత్ నుంచి కుల్దీప్ (9) ఒక్కరే టాప్ 10లో నిలిచాడు. ఆల్రౌండర్లలో అక్షర్ పదో స్థానంలో ఉన్నాడు. అటు టీ20 బ్యాటింగులో అభిషేక్ శర్మ (1), ఇషాన్ కిషాన్ (2), తిలక్(6), సూర్య (9) టాప్ 10లో ఉన్నారు.బౌలర్లలో వరుణ్ 2 ఉండగా. స్టార్ పేసర్ జస్రీ త్ బుమ్రా టాప్ 5లోకి చేరాడు. టీ20 ప్రపంచ కప్ తర్వాత భారత్ వన్డేలు ఆడకపోవడం గమ నార్హం. ఈ సంవత్సరంలో బంగ్లా, పాక్ జట్లు మాత్రమే 50 ఓవర్ల మ్యాచ్లు ఆడాయి.

నంబర్ 1గా టీమిండియా

ప్రస్తుతం ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్లో భారత్ వన్డే, టీ20 ఫార్మాట్లలో నంబర్ 1 జట్టుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన వన్డే సిరీస్లో పాకిస్థాన్ ఓడిపోయినప్పటికీ నాలుగో స్థానంలోనే ఉంది. వెస్టిండీస్ 10వ స్థానానికి పడిపోయింది. ఇక ఆల్రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి ఏకైక ఆటగాడిగా హార్దిక్ రెండో స్థానంలో నిలిచాడు. జింబాబ్వేకు చెందిన సికందర్ రజా అగ్రస్థానంలో ఉన్నాడు.

Tags:    

Similar News