IPL 2026: ఇవాళ బిగ్ ఫైట్.. ఆర్సీబీ vs రాజస్థాన్

ఆర్సీబీ vs రాజస్థాన్

Update: 2026-04-10 05:00 GMT

IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో భారీ సమరానికి వేదిక సిద్ధమైంది! ఈరోజు గువాహటి వేదికగా క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేసేందుకు సిద్ధమవుతున్నాయి 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానున్న ఈ పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో అని ఫ్యాన్స్ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన ఏ మ్యాచ్‌లోనూ ఇరు జట్లు ఓటమి రుచి చూడకపోవడం విశేషం. రాజస్థాన్ రాయల్స్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయ దుందుభి మోగించి, పాయింట్ల పట్టికలో గర్వంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అటు బెంగళూరు టీమ్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు, ఆడిన రెండు మ్యాచుల్లోనూ గ్రాండ్ విక్టరీస్ నమోదు చేసి మూడో స్థానంలో దూసుకుపోతోంది.

చరిత్రను ఒకసారి గమనిస్తే.. ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 31 సార్లు తలపడ్డాయి. ఇందులో ఆధిపత్యం ఎవరిదంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదే! 17 మ్యాచ్‌లలో RCB విజయం సాధించగా, రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్‌లలో జయకేతనం ఎగురవేసింది.మరి ఈరోజు గువాహటి మైదానంలో రాజస్థాన్ తన జోరును కొనసాగిస్తుందా? లేక RCB తన విక్టరీ ట్రాక్ రికార్డ్‌ను మరోసారి నిలబెట్టుకుంటుందా? చూడాలి.

Tags:    

Similar News