IPL 2026: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా.. రికార్డు సృష్టించిన రజత్ పాటిదార్!
రికార్డు సృష్టించిన రజత్ పాటిదార్!
IPL 2026: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయిని అందుకుని సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. శుక్రవారం (మే 22న) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో పాటిదార్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 56 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 55 పరుగుల తేడాతో ఓటమిపాలైనప్పటికీ, పాటిదార్ బాదిన ఆ ఒక్క సిక్సర్ ఆయన ఐపీఎల్ కెరీర్‌లో 100వ సిక్సర్‌గా నమోదైంది. ఎదుర్కొన్న బంతుల పరంగా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు.
ప్రముఖ క్రీడా విశ్లేషణ సంస్థ 'క్రిక్‌బజ్' ప్రకారం.. పాటిదార్ ఐపీఎల్‌లో 100 సిక్సర్ల మార్కును చేరుకోవడానికి కేవలం 933 బంతులు మాత్రమే తీసుకున్నారు. ఇంతకుముందు ఈ రికార్డు ముంబైకి చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివం దూబే పేరిట ఉండేది. దూబే తన 992వ బంతికి ఐపీఎల్‌లో 100వ సిక్సర్‌ను పూర్తి చేయగా.. ఇప్పుడు పాటిదార్ ఆ రికార్డును బద్దలు కొట్టారు. కాగా, ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 100 సిక్సర్లు బాదిన రికార్డు వెస్టిండీస్ లెజెండరీ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ పేరిట ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ఆడిన రస్సెల్ కేవలం 657 బంతుల్లోనే వంద సిక్సర్ల సెంచరీ మార్కును దాటేశారు.
ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ తరఫున 393 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన మూడవ బ్యాటర్‌గా ఉన్న పాటిదార్.. బెంగళూరు ఫ్రాంచైజీ తరఫున ఐపీఎల్‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన నాల్గవ బ్యాటర్‌గా, అలాగే రెండో భారతీయుడిగా నిలిచారు. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రజత్ పాటిదార్, ఆర్‌సీబీ తరఫున ఆడిన 55 మ్యాచ్‌ల్లోనే ఈ 100 సిక్సర్ల ఘనతను సాధించడం విశేషం.
ఇక ఆర్‌సీబీ తరఫున ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. గత 19 ఏళ్లలో ఆర్‌సీబీ తరఫున 281 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 312 సిక్సర్లు బాదారు. ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒకే జట్టు తరఫున 300 సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించారు. బెంగళూరు జట్టు తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో కోహ్లీ తర్వాత క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ ఉన్నారు. గేల్ 2011 నుండి 2017 వరకు ఆడిన 85 మ్యాచ్‌ల్లో 239 సిక్సర్లు బాదగా.. డివిలియర్స్ 2011 నుండి 2021 వరకు ఆడిన 156 మ్యాచ్‌ల్లో 238 సిక్సర్లతో ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.