IPL 2026: దంచి కొట్టిన ముకుల్.. లక్నో సూపర్ విక్టరీ
లక్నో సూపర్ విక్టరీ
IPL 2026: ఐపీఎల్-19లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతం చేసింది! ఓటమి కోరల్లోంచి ఊహించని విజయాన్ని లాగేసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో 3 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
లక్నో విజయానికి చివరి రెండు ఓవర్లలో 30 పరుగులు కావాలి. క్రీజులో ఉన్నాడు ముకుల్ చౌదరీ! ఇక అక్కడి నుంచి మొదలైంది అసలైన విధ్వంసం. 19వ ఓవర్ వేసిన కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 16 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు ముకుల్.
లాస్ట్ ఓవర్.. గెలవాలంటే 14 పరుగులు! ఉత్కంఠ తారాస్థాయికి చేరిన వేళ.. ముకుల్ చౌదరీ మరో రెండు భారీ సిక్సర్లు బాది లక్నోను గట్టెక్కించాడు. కేవలం 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌కు గాను ముకుల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 181/4 స్కోరు చేసింది. రఘువంశీ (45), రహానే (41), రోవ్‌మన్ పావెల్ (39 నాటౌట్) రాణించారు. అనంతరం 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోలో.. ఆయుష్ బదోనీ సైతం 54 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తన సత్తా చాటింది!