IPL 2026: RCB vs GT మహా సంగ్రామం: అహ్మదాబాద్‌లో పూనకాలు పక్కా!

అహ్మదాబాద్‌లో పూనకాలు పక్కా!

Update: 2026-05-30 12:02 GMT

IPL 2026: రెండు నెలల పాటు క్రికెట్ లవర్స్‌కు పూనకాలు తెప్పించిన ఐపీఎల్ 2026 క్లైమాక్స్ వచ్చేసింది. రేపు (సండే )నైట్ బాక్సాఫీస్ బద్దలైపోవడానికి రెడీగా ఉంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా.. మే 31వ తేదీ రాత్రి 7:30 గంటలకి జరగబోయే మహా సంగ్రామం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో.. హోమ్ టీమ్ గుజరాత్ టైటాన్స్ తలపడబోతోంది. ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ వైలెంట్ ఫైనల్‌కు గ్రౌండ్ సెట్ అయిపోయింది!

ఇంతకీ ఈ సారి కప్ కొట్టే మ్యాచ్ విన్నర్ ఎవరు? స్టాట్స్ అండ్ హిస్టరీ ప్రకారం చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తోంది. కానీ, గుజరాత్ టైటాన్స్‌కు ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఉంది. అదే.. అహ్మదాబాద్ స్టేడియంలో లక్ష మందికి పైగా వచ్చే హోమ్ క్రౌడ్ సపోర్ట్! ఆ ఊపుతో శుభ్‌మన్ గిల్ ఆర్మీకి లక్ కలిసిరావడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే ఈ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ కప్ కొట్టే ఛాన్సెస్ 54 శాతం ఉన్నట్లు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

ఈ మ్యాచ్‌ను డిసైడ్ చేయబోయే మేజర్ ఫ్యాక్టర్.. "టాస్". అహ్మదాబాద్ పిచ్‌పై రాత్రి వేళ మంచు ప్రభావం, అంటే డ్యూ ఫ్యాక్టర్ విపరీతంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ కళ్లు మూసుకుని బౌలింగ్ ఎంచుకోవడం ఖాయం. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు పిచ్ చాలా ఈజీ అయిపోతుంది. అందుకే టాస్ గెలిచిన టీమ్‌కే ట్రోఫీపై ఎక్కువ హక్కు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏదేమైనా సండే నైట్ అహ్మదాబాద్‌లో పరుగుల వరద పారడం మాత్రం ఖాయం! ఒకవైపు కింగ్ కోహ్లీ.. ఇంకోవైపు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ లాంటి క్లాస్ అండ్ మాస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 190 ప్లస్ దాటడం పక్కా అని ట్రెండ్స్ చెబుతున్నాయి. మరి ఈ మే 31న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్‌ను డిఫెండ్ చేసుకుంటుందా? లేక గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్‌లో మళ్లీ హిస్టరీ క్రియేట్ చేస్తుందా? చూడాలి.

Tags:    

Similar News